హాలీవుడ్ లో నటించే సామర్యం ఉన్న ఇండియన్ యాక్టర్స్ లో ప్రభాస్ ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రెబల్ స్టార్ కటౌట్ ఇప్పటికే ఇండియాలో భారీ స్థాయిలో పాకేసింది. ఇక అన్ని కుదిరితే హాలీవుడ్ తెరపై కూడా ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది.

సాధారణంగా హీరోలు ఒక దగ్గర మార్కెట్ లేకుంటే అటు వైపు సినిమాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడరు.  మంచి ఛాన్స్ వస్తే తప్ప ఒప్పుకోరు. ఇక ప్రభాస్ హాలీవుడ్ సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. తనకు సెట్టయ్యే కథ దొరికితే వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడట

.

బాహుబలి అనంతరం ప్రభాస్ విదేశాల్లో కూడా ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేశాడు. రీసెంట్ గా లండన్ కి బాహుబలి టీమ్ తో వెళ్లిన ప్రభాస్  అక్కడ రాయల్స్ ఆల్బర్ట్ హాల్ బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్నాడు.  అక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లైవ్ స్క్రీనింగ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.

ఈవెంట్ అనంతరం చాలా మంది అభిమానులు ప్రభాస్ కోసం ఎగబడ్డారు. అయితే హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయగలరా? అని ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ వెంటనే ఆన్సర్ ఇచ్చాడు. తనకు సెట్టయ్యే కథ దొరికితే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకుంటానని అన్నాడు.  అలాగే రెగ్యులర్ గా హాలీవుడ్ సినిమాలను ఫాలో అవుతుంటానని చెప్పిన ప్రభాస్ అవకాశం వస్తే తప్పకుండా హాలీవుడ్ లో నటించే అవకాశం ఉన్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు.

ఇక సాహో డిజాస్టర్ తో కాస్త తడబడిన ప్రభాస్ నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని 'జాన్' సినిమాతో సిద్దమవుతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.