ప్రభాస్ నుంచి ఈ ఏడాది వచ్చిన చిత్రం సాహో. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో నిరాశపరిచింది. కానీ నార్త్ లో ప్రభాస్ కు బాలీవుడ్ స్టార్స్ తో సమానంగా మార్కెట్ ఉందని ఈ చిత్రాన్ని నిరూపించింది. సాహో చిత్రం విడుదలైపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం సిద్ధం అవుతున్నాడు. 

రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ నటించబోతున్నాడు. ఇటీవల ప్రభాస్ జన్మదిన వేడుకలు ముగిశాయి. బాహుబలి చిత్రాన్ని లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించడంతో అక్కడ ప్రభాస్ సందడి చేశాడు. హైదరాబాద్ కు తిరిగి రాగానే మళ్ళీ దీపావళి సెలబ్రేషన్స్ లో మునిగిపోయాడు. 

ప్రభాస్ టాలీవుడ్ లోని అందరు హీరోలతో సన్నిహితంగా ఉంటాడు. దీపావళి సందర్భంగా ప్రభాస్ మంచు ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన దీపావళి సెలెబ్రేషన్స్ కు ప్రభాస్ హాజరయ్యాడు. మంచు విష్ణు, విరోనికా దంపతులతో ప్రభాస్ ఫోటోలకు ఫోజులిచ్చాడు. 

ప్రభాస్ నటిస్తున్న రాధాకృష్ణ దర్శకత్వంలోని చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.