బాహుబలి సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఓపెనింగ్స్ తో స్టార్ హీరో తన మార్కెట్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ త్వరలోనే 40వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు.  ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఎప్పటిలానే ప్రభాస్ పెళ్లిపై రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే గతంలో చాలా సార్లు అభిమానులు ప్రభాస్ నివాసం వద్ద బర్త్ డే విషెస్ చెప్పేందుకు వచ్చేవారు. ఇక ఇప్పుడు హార్డ్ కొర్ ఫ్యాన్స్ కి ఆ అదృష్టం దక్కేలా లేదు. ఎందుకంటె ప్రభాస్ తన బర్త్ డేను లండన్ లో జరుపుకోనున్నాడట. సన్నిహితంగా ఉండే స్నేహితులతో కలిసి ఒక సీక్రెట్ ప్లేస్ లో ప్రభాస్ పుట్టినరోజును జారుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. సాహో కి ముందు ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొన్న ప్రభాస్ ఆ తరువాత ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు.

సక్సెస్ మీట్ ని నిర్వహించాలని అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు అభిమానులకు దూరంగా విదేశాలకు పయనం కాబోతున్నాడు. మరి నాలుగు పదుల వయసు దాటిన రెబల్ స్టార్ ఈసారైనా పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమా లో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.