దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్ర ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తోంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలో మాత్రమే కాదు.. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా బాహుబలి 2 ప్రభంజనం సృష్టించింది. 

ఇప్పటికి బాహుబలి సంచలనాలు ఆగడం లేదు. తాజాగా బాహుబలి చిత్రాన్ని రష్యన్ భాషలోకి దబ్ చేశారు. రష్యాలో ఓ ప్రముఖ ఛానల్ బాహుబలి 2 చిత్రాన్ని టెలికాస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న రష్యన్ ఎంబసీ అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇండియన్ సినిమా రష్యాలో సైతం పాపులర్ అవుతోంది అంటూ ప్రశంసలు కురిపించారు. వావ్.. బాహుబలి చిత్రాన్ని రష్యాలో టెలికాస్ట్ చేయడం సంతోషాన్ని కలిగించే విషయం.జై మాహిష్మతి అంటూ బాహుబలి అధికారిక ట్విట్టర్ ఖాతా స్పందించింది. 

ఈ ట్వీట్ లో ప్రభాస్ శివగామితో.. ఓ ఆడదాని మనసు తెలుసుకోకుండా నీ కొడుక్కి మాట ఇవ్వడం తప్పు అని చెప్పే కోర్టు సన్నివేశాన్ని జోడించారు. ప్రభాస్ డైలాగులని రష్యన్ లో వినడం కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ.. మన తెలుగు సినిమా రష్యాలో టెలికాస్ట్ కావడం గర్వకారణమే.