ప్రభాస్, అనుష్క సూపర్ హిట్ జోడికి వెండితెరపై తిరుగులేని క్రేజ్ ఉంది. ప్రభాస్, అనుష్కపై రూమర్లకు కూడా కొదవ లేదు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ అనేక పుకార్లు వినిపించాయి. త్వరలో పెళ్లి జరగబోతోందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలని ప్రభాస్, అనుష్క ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పారు. 

ప్రభాస్, అనుష్క పలు చిత్రాల్లో నటించారు. కానీ బాహుబలి చిత్రం ప్రత్యేకమైనది. బాహుబలి చిత్రంతో ప్రభాస్, అనుష్క లకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. బాహుబలి ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రభాస్, అనుష్క, తమన్నా పర్యటించారు. 

ఓ ఈవెంట్ లో ప్రభాస్, అనుష్క మధ్యలో తమన్నా కూర్చుంది. ఆ సమయంలో రాజమౌళి ప్రసంగిస్తున్నారు. రాజమౌళి మాటలకు అక్కడున్న వారంతా క్లాప్స్ కొడుతున్నారు. కానీ అనుష్క మాత్రం సైలెంట్ గా కూర్చుని ఉంది. 

దీనితో ప్రభాస్ పక్కనే ఉన్న తమన్నాని తట్టి.. అనుష్కని క్లాప్స్ కొట్టమని చెప్పమని తమన్నాతో అన్నాడు. ఆ తర్వాత ప్రభాస్, అనుష్క మధ్య చిన్నపాటి సైగలు జరిగాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.