బాహుబలి అనంతరం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొత్తానికి సాహో అయితే పెట్టిన బడ్జెట్ ని వెనక్కి తెచ్చేసింది. అయితే ఇక నుంచి బిగ్ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా చేయనని చెప్పిన ప్రభాస్ మళ్ళీ అదే బాటలో అడుగులు వేయక తప్పడం లేదు.

జాన్ సినిమా కోసం దాదాపు 150కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా నడుస్తుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని యూరప్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ 18న సినిమాకు సంబందించిన మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు.

అసలైతే ఈ షెడ్యూల్ కూడా యూరప్ లోనే చేయాలనీ అనుకున్నారు.  కానీ మళ్ళీ కొన్ని కారణాలతో ఇండియాకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. జాన్ సినిమాలో 1980ల కాలం నాటి వాతావరణం కనిపించేలా సెట్స్ ని డిజైన్ చేస్తున్నారట. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ కోసం 25రకాల భారీ సెట్స్ ని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించిననున్నట్లు టాక్.  బడ్జెట్ లో కొన్ని మార్పులు చేస్తూ ఉన్నంతలో సెట్స్ ని డిజైన్ చేయించాలని చిత్ర యూనిట్ కూడా ప్రభాస్ సలహాకు ఒప్పుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. మొదట 100కోట్ల లోపే తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు 180కోట్లకు పోటూ పడుతున్నట్లు తెలుస్తోంది.  

ఒక రైల్వే స్టేషన్ సెట్ కి మాత్రం గట్టిగా ఖర్చు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.