సాహో సినిమాతో కాస్త తడబడిన ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ 20వ ప్రాజెక్ట్ ని గోపికృష్ణ - యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సినిమాకు ఓ డియర్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.    చాలా రోజుల తరువాత ఆ సినిమా అప్డేట్ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ గా ఒక క్యూట్ సీక్వెన్స్ ని పూర్తి చేసినట్లు చెప్పిన యూవీ క్రియేషన్స్  త్వరలో మరొక షెడ్యూన్ ని స్టార్ట్ చేయనున్నట్లు వివరణ ఇచ్చింది. వీలైనంత త్వరగా మరొక స్పెషల్ అప్డేట్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారట.

అయితే ఇటీవల సినిమా కోసం 150 మందితో కలిసి ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ 2కోట్ల ఖర్చుతో ఒక మార్కెట్ సెట్ ని డిజైన్ చేశారట. ఒక్క షాట్ కోసం 10రోజుల పాటు ప్రభాస్ కష్టపడినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట. ప్రభాస్ 20 ఫస్ట్ ఫస్ట్ లుక్ ని ఉగాదికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. జిల్ సినిమా అనంతరం రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మరి ప్రభాస్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.