బాక్స్ ఆఫీస్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది భారీ స్థాయిలో సాహో సినిమాతో ఆడియెన్స్  ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా అభిమానులు అనుకున్నంతగా మెప్పించలేకపోయింది. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎదో ఒక విధంగా మంచి సక్సెస్ అందుకోవాలని రొమాంటిక్ లవ్ డ్రామాతో సిద్దమవుతున్నాడు.

అయితే ఆ సినిమా కు మొదటి 'జాన్' అనే టైటిల్ ని అనుకున్నట్లు టాక్ వచ్చింది. అది నిజమే అని రీసెంట్ గా దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కిన 96 రీమేక్ కి జాను అనే టైటిల్ ని సెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే జాను టైటిల్ చూసి ప్రభాస్ అభిమానుల్లో కొంత అలజడి రేగింది. అర్ధాలు వేరైనా అక్షరాలు చాలా దగ్గరగా ఉండడం ప్రభాస్ సినిమా టైటిల్ కి తగదని కామెంట్స్ వచ్చాయి.

అయితే ఈ విషయంలో ముందే దిల్ రాజు యువీ క్రియేషన్స్ ని సంప్రదించాడట,. 96 రీమేక్ మొదలుపెట్టాలని అనుకున్నప్పుడే జాను టైటిల్ అనుకున్నట్లు చెప్పిన దిల్ రాజు వెంటనే టైటిల్ కోసం ప్రభాస్ టీమ్ కి సమాచారం అందించాడు. కొన్ని రోజుల తరువాత ప్రభాస్ అండ్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాను టైటిల్ ని దిల్ రాజు ప్రమోట్ చేసుకున్నారు. ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా టైటిల్ జాన్ కాదని దాదాపు క్లారిటీ వచ్చినట్లే. అయితే ఇప్పుడు ఎలాంటి టైటిల్ ని సెట్ చేస్తారో చూడాలి. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.