శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్ (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా  "పోస్టర్".  ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకొని సెన్సార్ కి వెళ్లేందుకు సిద్దమవుతుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల అయి ప్రేక్షలను అలరిస్తున్న విషయం తెలిసినదే. 

ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, శంకర్ గణేష్, మల్లికార్జున్, అజయ్..,  వంటి నటీనటులు నటించారు. 

ఇటీవల వెండితెరపై రొమాంటిక్ కంటెంట్ తో వస్తున్న చిత్రాలు ఎక్కువవుతున్నాయి. పోస్టర్ మూవీ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ అక్షిత అందచందాలు ఆరబోసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ లో అక్షిత హాట్ లుక్ తో అదరగొడుతోంది.

ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు.