జాతీయ అవార్డు గెలుచుకున్న గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఠాగూర్ చిత్రంలో నేను సైతం అనే పాటకుగాను ఉత్తమ లిరిసిస్ట్ గా సుద్దాల అశోక్ తేజ జాతీయ అవార్డు అందుకున్నారు. ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలు అందించారు. తాజా సమాచారం మేరకు సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. 

కొంత కాలంగా సుద్దాల అశోక్ తేజ కాలేయ సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించగా.. వైద్యులు కాలేయ మార్పిడి అవసరం అని సూచించినట్లు తెలుస్తోంది. 

14 వేలమంది రోడ్డున పడతారు.. క్లియర్ గా చెప్పిన చిరంజీవి.. రాజమౌళి ఐడియా ఇదే

దీనితో ప్రస్తుతం ఆయనకు అత్యవసరంగా బి నెగిటిగ్ బ్లడ్ అందించాలి. అశోక్ తేజ స్నేహితుడు జగన్ మెట్ల బి నెగిటివ్ బ్లడ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ బ్లడ్ గ్రూప్ కలవారు ఎవరైనా వచ్చి రక్తం అందించాలని కోరుతున్నారు. అందుకోసం 8985038016 అనే ఫోన్ నంబర్ కు కాంటాక్ట్ కావాలని కోరుతున్నారు. 

అన్నిరకాల పాటలు రాయగల సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ జానపదంపై మంచి పట్టు ఉంది.