టివి నటులకు ఎక్కడైనా అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. టివి సీరియల్స్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తుంటాయి. దీనితో ఆయా సీరియల్స్ లో నటించే నటీమణులకు చాలామందే ఫ్యాన్స్ ఉంటారు. కేరళ బుల్లి తెరపై యంగ్ బ్యూటీ మేఘన విన్సెంట్ స్టార్. 

ఆమె నటించే సీరియల్స్ కు మంచి క్రేజ్ ఉంది. కొన్నేళ్ల క్రితం మేఘన తన ప్రియుడు డాన్ టామీని వివాహం చేసుకుంది. అదే రోజు ఒకే వేడుకలో ఆమె సోదరి డింపుల్ రోజ్ వివాహం కూడా మరొక బిజినెస్ మ్యాన్ తో జరిగింది. 

నికిత శర్మ సెక్సీ వేషాలు.. కుర్రకారుని రెచ్చగొట్టేలా ఫోజులు

కానీ తాజాగా మేఘన తన భర్త నుంచి విడాకులు పొందినట్లు టాక్. 2018 నుంచి ఈ జంట విభేదాల కారణంగా వేరు వేరుగా జీవిస్తున్నారట. ప్రస్తుతం వీరిద్దరూ అధికారికంగా విడాకులు పొందారని వార్త అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. 

మేఘన కేరళలో పలు టివి సీరియల్స్ ద్వారా నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది.