Asianet News TeluguAsianet News Telugu

విభేధాలు?: బెల్లంకొండ ప్రాజెక్టు నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్

సినిమా  ప్రారంభమైన తర్వాత దర్శకుడుకు, మిగతా టెక్నీషియన్స్ కు సింక్ కాకపోతే విభేధాలు మొదలవుతాయి. అవి పెరిగి పెద్దవై ఒక్కోసారి ఆ టెక్నీషియన్స్ బయిటకు వెళ్లే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం అదే పరిస్దితి ఎదుర్కొంటోందని సమాచారం. 

Popular cinematographer walks out from Bellamkonda movie
Author
Hyderabad, First Published Jan 5, 2020, 2:47 PM IST

సినిమా  ప్రారంభమైన తర్వాత దర్శకుడుకు, మిగతా టెక్నీషియన్స్ కు సింక్ కాకపోతే విభేధాలు మొదలవుతాయి. అవి పెరిగి పెద్దవై ఒక్కోసారి ఆ టెక్నీషియన్స్ బయిటకు వెళ్లే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం అదే పరిస్దితి ఎదుర్కొంటోందని సమాచారం. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా చేస్తున్న చిత్రం నుంచి టాప్ సినిమాటోగ్రాఫర్ డ్యూడ్లీ బయిటకు వెళ్లిపోయారని సమాచారం.

చెన్నై ఎక్సప్రెస్, సింగం వంటి హిట్ చిత్రాలకు పని చేసిన ఆయన్ని ఇష్టపడి మరీ తెచ్చుకున్నారు సంతోష్ శ్రీనివాస్. అయితే షూటింగ్ ప్రారంభమయ్యాక...సంతోష్ శ్రీనివాస్ కూడా గతంలో సినిమాటోగ్రాఫర్ కావటంతో..ఇన్వాల్వమెంట్ ఎక్కువగా ఉంటోందిట. అంత పెద్ద సినిమాటోగ్రాఫర్ కు ఇద్ది ఇబ్బందిగా అనిపించిందిట. నువ్వు ప్రస్తుతం సినిమా డైరక్టర్ వే, నాకు సినిమాటోగ్రఫీ వదిలేయ్ అని చెప్పాడట. కానీ సంతోష్ శ్రీనివాస్ ఎలాగైనా ప్రాజెక్టుని అద్బుతం చేయాలనే తపనతో కాస్త ఎక్కువ ఇన్వాల్వ్ అవటం జరుగుతోంది. దాంతో విబేధాలు పెరగకముందే బయిటకు వెళ్లిపోవటం బెస్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. దాంతో ఆయన ప్లేస్ లోకి ఛోటా కె నాయడు వచ్చి చేరారు.ఫస్ట్ షెడ్యూల్ వరకూ డూడ్లీ చేస్తే..సెకండ్ షెడ్యూల్ నుంచి ఛోటా చేస్తున్నారు.
 
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా కందిరీగ‌  ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం ఇది. ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌బోతోంది.  హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో చిత్రీక‌రణ జ‌ర‌ప‌బోతున్నారు. ఈ ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు.  
 
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా న‌టిస్తున్న ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఆర్ట్ డైరెక్ట‌ర్: అవినాష్ కొల్ల‌, ఎడిట‌ర్: త‌మ్మిరాజు, మాట‌లు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత: గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం, స్టోరీ, స్కీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్ష‌న్: సంతోష్ శ్రీనివాస్.

Follow Us:
Download App:
  • android
  • ios