ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ఆమె చేసే కామెంట్స్ ఎందుకో, ఎవరిని ఉద్దేశించేచో అందరికీ అర్థం కావు. కానీ కొందరు మాత్రం పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ని, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించే ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేస్తోంది అని భావిస్తున్నారు. 

ఓ అబద్ధాలకోరు రాజకీయంగా నాయకుడు కాగలడేమో కానీ లీడర్ కాలేడు, జల్సాలు చేసే డైరెక్టర్ అంటూ గతంలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా పూనమ్ కౌర్ మరోసారి తన నోటికి పని చెబుతూ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ఏకంగా #PKLove అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టేసింది. 

ఈ ట్వీట్ లో పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'డబ్బు హోదా ఉన్నవాడు రాజు కావొచ్చేమో కానీ ప్రేమత్యాగం, న్యాయం కోసం పోరాడేవాడు వీరుడవుతాడు. రాజులు శాసిస్తారు.. వీరులు మిమల్ని కాపాడుతారు. శాసించాలి అనే తపనపడే వ్యక్తిలో అహంకారం ఉంటుంది. అందరూ బావుండాలి అని కోరుకునే వ్యక్తిలో ప్రేమ వైరాగ్యం ఉంటుంది' అని పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. 

ఈ ట్వీట్ లో పూనమ్ కౌర్ తిడుతోందా లేక పొగుడుతోందా అనేది కూడాఅర్థం కావడం లేదు. ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేసే బదులు డైరెక్ట్ గానే తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పొచ్చుగా  అనే అభిప్రాయం కొందరి నెటిజన్ల నుంచి వ్యక్తం అవుతోంది.