సినిమాల పరంగా కంటే తన కామెంట్స్ తో ఎక్కువగా పాపులారిటీ  సంపాదించింది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్. తెలుగులో పూనమ్ కౌర్ పలు చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా ఆమె దక్కించుకున్న గుర్తింపు తక్కువే. సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ నర్మగర్భంగా చేసే కామెంట్స్ ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. 

కానీ పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లని టార్గెట్ చేస్తూ గతంలో కొన్ని ట్వీట్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక సామజిక అంశాలపై కూడా పూనమ్ కౌర్ బాధ్యతతో వ్యవహారిస్తుంది. సోషల్ మీడియాలో తనని కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారని గతంలో పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా తాజాగా పూనమ్ కౌర్ తాను ఫుల్ జోష్ లో ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి సౌందర్యల సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని వాన వల్లప్ప సాంగ్ కు డాన్స్ చేసింది. తన ఇంట్లో టివిలో ఆ సాంగ్ వస్తుండగా.. పూనమ్ కౌర్ సౌందర్య లాగా డాన్స్ చేసింది. 

సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నా. ఆమెల డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. తప్పులుంటే తిట్టుకోవద్దు బాబూ అంటూ సరదాగా కామెంట్ పెట్టింది.