దిశ కేసులో నలుగురు నిందితులని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో  నలుగురు నిందితులు మరణించారు. నిందితులని ఎన్ కౌంటర్ చేయడం ద్వారా పోలీసులు దిశకు సరైన న్యాయం చేశారని  సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. 

ఈ ఎన్ కౌంటర్ పై సినీ నటి పూనమ్ కౌర్ కూడా స్పందించారు. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం అభినందనీయమని సంతోషం వ్యక్తం చేశారు. దిశ ఘటన తెలిసి తాను ఎంతో ఆవేదన చెందానని, ఆందోళన చెందానని.. కానీ నిందితులకు ఇంత త్వరగా శిక్ష వేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

చీరకట్టులో 'కంచె' భామ.. మతిపోగొట్టే ఫోజులు వైరల్!

ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడినవారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇక ఏ ఆడపిల్లను ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు, ప్రభుత్వాలకు ఉందని అన్నారు. ఇలా పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్.

ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కాసేపటికే ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది. కానీ అంతలోపే ట్వీట్ కాస్త వైరల్ అయింది.

ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. 'ఉదయమే మంచి వార్త విన్నాను.. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణా సీఎం, తెలంగాణా డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు కొంతమంది మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు' అంటూ రాసుకొచ్చింది.

ఈ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ పేరు నేరుగా వాడనప్పటికీ.. ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలను ఉద్దేశిస్తూ ఆమె కామెంట్ చేసింది. దీంతో అది పవన్ కళ్యాణ్ కోసమేననే విషయం అర్ధమవుతోంది.