టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న పూజాహెగ్డే నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో బన్నీతో చాలా ఫోటోలు తీసుకున్నానని.. వాటిని త్వరలోనే బయటపెడతానని చెబుతోంది పూజా.

అల్లు అర్జున్ చాలా గ్యాప్ తరువాత వస్తున్న సినిమా కావడం ఆయన ఫ్యాన్స్ చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని.. షూటింగ్ లో ఏం జరుగుతుందో చెప్పమని అడిగేవారని.. తను షూటింగ్ సమయంలో చాలా ఫోటోలు, వీడియోలు తీశానని.. కానీ వాటిని బయటపెట్టలేకపోయానని అన్నారు.

'జబర్దస్త్' కమెడియన్ బెడ్రూమ్ టాపిక్.. చెంప చెళ్లుమనిపించిన యాంకర్!

త్వరలోనే ఆ ఫోటోలను బయటపెడతానని చెప్పారు. 'సామజవరగమన' పాటకి సంబంధించిన ఫోటోలు మాత్రం పూజా పోస్ట్ చేశారు. ఐఫిల్ టవర్ ముందు తీసుకున్న ఫోటోలు కావడంతో ఆగలేకపోయానని చెప్పారు.

సినిమాలో సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయని.. ఆ మూడు కూడా అమ్మాయి సెంట్రిక్ గా కంపోజ్ చేసిన పాటలని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మూడు హిట్టు పాటలు తనపై రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.