స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లోనే అలవైకుంఠపురము చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అల వైకుంఠపురములో మూవీ బాహుబలి తర్వాత టాలీవుడ్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా బన్నీ ప్రస్తుతం ఓ సాహసోపేతమైన చిత్రానికి రెడీ అవుతున్నాడు. 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో బన్నీ ఎర్ర చందనం అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు టాక్. 

ఇక ఈ మూవీలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. సుకుమార్ సినిమా అంటే స్పెషల్ సాంగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే దిశా పటాని పేరు వినిపిస్తోంది. తాజాగా మరో క్రేజీ బ్యూటీ పేరుని సుకుమార్ పరిశీలిస్తున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. తన అంద చందాలు, అభినయంతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న పూజా హెగ్డే. 

న్యూడ్ ఫోటోలతో రచ్చ, ఫ్యామిలీ వదిలేసింది.. గంగూలీ, నగ్మా మాత్రమే కాదు.. చాలా ఉన్నాయి

ఇప్పటికే పూజా హెగ్డే బన్నీతో రెండు చిత్రాల్లో నటించింది. ఈ చిత్రంలో పూజా స్పెషల్ సాంగ్ చేసేది నిజమే అయితే మూడవసారి ఈ జంట వెండితెరపై మెరవబోతున్నట్లు అవుతుంది. కానీ పూజా హెగ్డేకు ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేసేంత తీరిక లేదు. వరుస చిత్రాలతో పూజా దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో పూజా పుష్ప మూవీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే జిగేలు రాణి అంటూ చిందులేసింది.