టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఏర్పడిన సమయంలో కొత్త హీరోయిన్స్ దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అయితే మొన్నటివరకు కొంచెం మిడిల్ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు అందుకున్న హీరోయిన్స్ ఇప్పుడు టాలీవుడ్ క్వీన్స్ గా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా పూజా హెగ్డే వరుసగా అవకాశాలను అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటోంది.

బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే రెచ్చిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు ఈ మధ్య నాన్ స్టాప్ గా అవకాశాలను అందుకుంటోంది.బాలీవుడ్ లో మొన్న హౌజ్ ఫుల్ 4 సినిమాతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ అదే తరహాలో అక్షయ్ తోనే మరో సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ నెక్స్ట్ బచ్చన్ పాండే అనే సినిమాతో రాబోతున్నాడు. అందులో సెకండ్ హీరోయిన్ గా బేబీకి ఛాన్స్ దక్కినట్లు టాక్.

 

ప్రస్తుతం పూజా తెలుగులో ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో పాటు అఖిల్ 4వ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లను కూడా ఈ భామ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం. ఇకపోతే రీసెంట్ గా ఇద్దరు హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసిన బంగార్రాజు అవకాశాన్ని అమ్మడు లాగేసుకున్నట్లు టాక్ వస్తోంది. బంగార్రాజులో నాగ్ హీరోయిన్ కోసం ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని అలాగే కాజల్ వంటి సీనియర్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు.

అయితే చివరికి పూజ హెగ్డే వైపుకు చిత్ర యూనిట్ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగ చైతన్యకు జోడిగా కీర్తి సురేష్ నటించనుంది. ఈ క్రమంలో నాగార్జునకి పాట్నర్ ని సెలెక్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతోంది. ఫైనల్ గా రేస్ లో ఉన్న పూజా హెగ్డే ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సెలెక్ట్ చేసినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్నీ రోజులు వెయిట్ చేయాల్సిందే.