టాలీవుడ్ లొనే కాకుండా బాలీవుడ్ లో సైతం సత్తా చాటుతోంది పూజా హగ్డే. వరుస విజయాలతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. సీనియర్ హీరోయిన్స్ హవా తగ్గడంతో అందరు పూజ వైపే మొగ్గు చూపుతున్నారు. రెమ్యునరేషన్ ఎంత పెంచినా పట్టించుకోవడం లేదు. పైగా వచ్చేవన్ని పెద్ద సినిమాలే. పూజ బాలీవుడ్ లో ఇటీవల హౌజ్ ఫుల్ 4 తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 

ఆ హిట్టుతో బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ అందుకుంటోంది. ఇక తెలుగులో అయితే అల..వైకుంఠపురములో.. హిట్టు అమ్మడి క్రేజ్ ని మరీంత పెంచేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. టాలీవుడ్ లో ఈ బుట్టబొమ్మ చేయడానికి ఒప్పుకున్న సినిమాల గురించి ఒక టాక్ వైరల్ అవుతోంది. పూజ అఖిల్ 4వ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఆ సినిమాకు పూజా భారీ పారితోషికాన్ని అందుకుందట. అది హీరో అఖిల్ కంటే ఎక్కువ మొత్తం అని తెలుస్తోంది.

అఖిల్ వరుస అపజయలతో ఉండడంతో నిర్మాతలు  రెమ్యునరేషన్ గురించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. సినిమా మొదలైన తరువాత అఖిల్ కేవలం కోటి రూపాయల చెక్ ని మాత్రమే అందుకున్నాడట. ఇక సినిమా సక్సెస్ ని బట్టి ఆ తరువాతి రెమ్యునరేషన్ ఉంటుందని సమాచారం. అయితే పూజా హగ్డే కి మాత్రం కొట్టిన్నర వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. సినిమా సక్సెస్ తరువాత అఖిల్ రెమ్యునరేషన్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే బుట్టబొమ్మదే అప్పర్ హ్యాండ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని గీత ఆర్ట్స్ కో బ్యానర్ GA2 సంస్థలో రూపొందుతోంది.