టాలీవుడ్ లో ప్రస్తుతం పూజా హెగ్డే ట్రెండ్ గట్టిగానే నడుస్తోంది. ఒకప్పుడు ఆఫర్స్ అందుకోవడానికె ఎంతగానో సతమతమైన ఈ భామ మొత్తంగా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. రీసెంట్ గా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమా అమ్మడి స్థాయిని మరీంత పెంచిందని చెప్పవచ్చు. ఇక అవకాశాలు వసున్నపుడే రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచింది.

అలాగే నార్త్ సైడ్ కూడా మంచి మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇక రీసెంట్ గా మరో బిగ్ బడ్జెట్ సినిమాలో కూడా ఈ బుట్టబొమ్మ ఛాన్స్ కొట్టేసింది. సల్మాన్ ఖాన్ త్వరలో స్టార్ట్ చేయనున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిసంచానున్నట్లు సమాచారం. ఇటీవల బాలీవుడ్ లో హౌజ్ ఫుల్ 4 సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. దీంతో అటునుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ నెక్స్ట్ 'ఖబీ ఈద్ ఖబీ దీవాలి' అనే సినిమా చేయబోతున్నాడు. అందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటించనుందట. ఫర్హాద్ సంజి దర్శకత్వం వహించనున్న ఆ సినిమాను సాజిద్ నదియా ద్వాల బిగ్ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రాధే సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రభుదేవా ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ,ఇక బాలీవుడ్ లో చాలా కాలం తరువాత మంచి అఫర్ అందుకున్న పూజా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.