పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పూజా హెగ్డే పట్టిందల్లా బంగారం అవుతోంది. తెలుగులో బిజీ హీరోయిన్ గా రాణిస్తూనే బాలీవుడ్ లో సైతం ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల పూజా హెగ్డే నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి ఘనవిజయంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం పూజ హెగ్డే ప్రభాస్ తో ఓ చిత్రంలో, అఖిల్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది. డీజే చిత్రం నుంచి టాలీవుడ్ లో పూజా హెగ్డే హవా మొదలయింది. పూజా హెగ్డే తన గ్లామర్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. 

ఇప్పటికే పూజా హెగ్డే అందంతో మతిపోగొడుతోంది. అయినా కూడా జిమ్ లో కసరత్తులు చేస్తూ పూజా తన గ్లామర్ కు పదును పెడుతోంది.  హీరోయిన్లు జిమ్ లో వర్కౌట్ చేస్తున్న దృశ్యాలు తరచుగా వైరల్ అవుతుంటాయి. తాజగా పూజా హెగ్డే జిమ్ లో వర్కౌట్ చేస్తున్న దృశ్యం నెటిజన్లకు షాకిచ్చే విధంగా ఉంది. స్ట్రెచ్చింగ్ వర్కౌట్ చేస్తున్న పూజా హెగ్డే ఫోజు చాలా కష్టంతో కూడుకున్నది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I woke up like this... 😴🤷🏻‍♀️ #goodmorning #stretchitout @samir.purohit

A post shared by Pooja Hegde (@hegdepooja) on Jan 29, 2020 at 8:29pm PST

దీనితో పూజా హెగ్డే ఫోటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి స్ట్రెచ్చింగ్స్ జాగ్రత్తగా చేయాలని.. లేకుంటే కాలికి గాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సెలెబ్రిటీలు తగు జాగ్రత్తలతోనే ఫిజికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో  ఎలాంటి కసరత్తులు చేస్తుంటారు.