పూజా హెగ్డే అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న నేమ్. స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పైకి వస్తున్నాయి అంటే హీరోయిన్ గా మొదట పూజా పేరే వినిపిస్తోంది. డేట్స్ అందుబాటులో ఉంటే దాదాపు ఆమెనే ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ స్థానాలకు ఎసరెట్టిన ఈ ముద్దగుమ్మకు ఎవరు పెద్దగా పోటీ ఇవ్వడం లేదు.

ఓ వైపు రష్మిక మందన్న కూడా సక్సెస్ లతో ముందుకు సాగుతున్నప్పటికీ పూజ రేంజ్ లో సక్సెస్ అవ్వడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే...రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే హౌస్ ఫుల్ 4తో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు రివ్యూలు నెగిటివ్ గా వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా హిట్టని తేలిపోయింది.

దీంతో పూజ హెగ్డేకి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. త్వరలో F2 సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుంది. దిల్ రాజు - బోణి కపూర్ తో కలిసి హిందీలో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు.  అయితే మెహ్రీన్ చేసిన హాని పాత్రలో పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకోవడమే కాకుండా బాలీవుడ్ లో కూడా సక్సెస్ రావడంతో అమ్మడిని F2 సినిమాకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరి ఆ సినిమాతో అమ్మడు బాలీవుడ్ లో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.  డీజే' సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో  నటిస్తోంది. అలానే ప్రభాస్ తో కలిసి 'జాన్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఈ రెండు మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. దీంతో అమ్మడు తన రేమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది.

ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు తీసుకుంటుంది. ఈ రెమ్యునరేషన్ పూజకి చాలా ఎక్కువని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు లేకపోవడంతో మేకర్లు పూజాని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సమంతకి పెళ్లి కావడం, రకుల్ క్రేజ్ తగ్గిపోవడం, రాశి, మెహ్రీన్ లాంటి వారికి స్టార్ హోదా లేకపోవడంతో ఫిలిం మేకర్ల వద్ద మరో ఆప్షన్ లేక పూజానే తీసుకుంటున్నారు. అది పూజాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దీంతో తన రెమ్యునరేషన్ విషయంలో అమ్మడు వెనుకడుగు వేయడం లేదు.