అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ సినిమా హిట్టయిన తరువాత పూజా హెగ్డే లైఫ్ చాలా మారింది. బికినీ లుక్ తో పాటు అమ్మడి నటన అన్ని వర్గాల ఇండస్ట్రీలను ఆకర్షించాయి. వరుస అవకాశాలు అందుకుంటూ తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ కి ఆధారణ తగ్గడంతో అనువుగా భావించిన అరవింద బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ దక్కించుకుంది.

జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ - మహేష్ బాబు అలాగే అఖిల్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా అగ్ర కిరీటాన్ని అందుకుంటోంది. ఇక ఇటీవల అమ్మడు బాలీవుడ్ లో కూడా మంచి హిట్ అందుకుంది. గతంలో బాలీవుడ్ లో చేసినప్పటికీ డిజాస్టర్ కారణంగా ఎవరు పట్టించుకోలేదు. ఇక టాలీవుడ్ లో క్లిక్కవుతుందని ఇటీవల హౌజ్ ఫుల్ 4 సినిమాలో భామకు అవకాశం ఇచ్చారు.

ఆ సినిమా సక్సెస్ కావడంతో నిర్మాత సాజిద్ నదియాద్వాల పూజతో మరో మూడు సినిమాలు చేయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కిక్ 2 సినిమాలో కూడా పూజా హెగ్డే నటించే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో పూజా స్క్రీన్ షేర్ చేసుకుంటుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సాధారణంగా సల్మాన్ చిన్న హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడంలో ముందుంటాడు. స్టార్ హీరోయిన్స్ గా ఉన్న చాలా మంది సల్మాన్ సపోర్ట్ తో వచ్చినవారే. మరి పూజా లక్కు ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.