టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ పూజా హెగ్డే. పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా పూజా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం పూజాకి చేదు అనుభవాలు తప్పడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హౌజ్ ఫుల్ 4 కూడా మొదటి షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో బేబీ ఆశలు గల్లంతయ్యాయి.

కెరీర్ మొదట్లో పూజా హెగ్డే మోడల్ గా ఉన్నప్పుడు ఎక్కువగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 2016లో హృతిక్ రోషన్ బిగ్ బడ్జెట్ మూవీ మొహంజదారో లో అవకాశం అందుకున్న పూజాని అప్పట్లో చాలా లక్కీ అనుకున్నారు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పూజా దశ తిరిగిపోతుందని అంతా భావించారు. కానీ అమ్మడు ఊహించని డిజాస్టర్ ని అందుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశం అందుకోవడానికి మూడేళ్లు పట్టింది.

డీజే - మహర్షి సినిమాలు కాస్త బూస్ట్ ఇవ్వడంతో బేబీ హౌజ్ ఫుల్ 4 లో కూడా అవకాశం అందుకుంది. ఫైనల్ గా నేడు విడుదలైన ఆ సినిమా బోరింగ్ గా ఉందనే టాక్ వస్తోంది. బాలీవుడ్ క్రిటిక్స్  అయితే ప్రివ్యూలతోనే సినిమా ఛండాలంగా ఉందని ఒకటిన్నర రేటింగ్ ఇవ్వడం షాక్ కి గురి చేస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పూజా కి బాలీవుడ్ లో మరో దెబ్బ నుంచి తప్పించుకోలేకపోయిని టాక్ వస్తోంది. ఇక నెక్స్ట్ ఆమె టాలీవుడ్ సినిమాలతోనే సరిపెట్టుకోవాలి.

ప్రస్తుతం అరవింద బ్యూటీ  'అల.. వైకుంఠపురములో..' నటిస్తోన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ తో జాన్ అనే సినిమా కూడా చేస్తున్న పూజా యువ హీరో అఖిల్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. గీత ఆర్ట్స్ లో రూపొందుతున్న ఆ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.