దక్షణాది తో పాటు బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గా పూజా హెగ్డే అల వైకుంఠపురములో చిత్రంతో ఘనవిజయం సొంతం చేసుకుంది. తెలుగులో పూజా హెగ్డే డీజే, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి చిత్రాల్లో నటించింది. 

పూజా గ్లామర్ హొయలకు తెలుగు యువత మొత్తం ఫిదా అయ్యారు. రోజు రోజుకు పూజా హెగ్డే క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల పూజా హెగ్డే కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే భారీ ఆఫర్ కొట్టేసింది. ఇదిలా ఉండగా పూజా హెగ్డే గ్లామర్ కు కేవలం యువత మాత్రమే ఫిదా అవుతారు అనుకుంటే పొరపాటే. అంకుల్ వయసున్న వారు కూడా పూజా అందానికి దాసులే. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sethji aapka phone hogaya vasool🤪

A post shared by Viral Bhayani (@viralbhayani) on Feb 16, 2020 at 11:21pm PST

ముంబై ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఇటీవల ఈ అందాల బుట్టబొమ్మ ముంబై విమానాశ్రయంలో మెరిసింది. పూజా హెగ్డే కనిపించగానే ఓ అంకుల్ ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డాడు. పాపం అంకుల్ కదా అని పూజా కూడా సెల్ఫీకి పోజు ఇచ్చింది. కానీ కంగారులో ఆ అంకుల్ సెల్ఫీ సరిగా తీయలేకపోయాడు. 

నగ్నంగా ఫోటో షూట్.. షాకిచ్చిన హీరోయిన్ .. బోల్డ్ ఫోజులు వైరల్!

ఓ సందర్భంలో ఫోన్ కూడా జారిపోబోయింది. అంకుల్ పడుతున్న తిప్పలు చూసి పూజాతో సహా అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. కొద్దిక్షణాల్లో అక్కడున్న యువత మొత్తం పూజా హెగ్డేని సెల్ఫీల కోసం చుట్టుముట్టారు. ఈ వీడియో చూస్తే మీకు కూడా నవ్వు ఆగదు. 

పూజా హెగ్డే ప్రస్తుతం అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో, ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.