హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో రారాణిలా వెలుగొందుతోంది. పూజాది హెగ్డే పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ ఏడాది పూజా హెగ్డే అల వైకుంఠపురములో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. 

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు, ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రికెట్ పై తన ఇష్టాన్ని బయటపెట్టింది. 

క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టం అని పూజా హెగ్డే పేర్కొంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ మ్యాచ్ జరుగుతుంటే కనీసం స్కోర్ అయినా తెలుసుకుంటా. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కి వీరాభిమానిని అని పూజా హెగ్డే పేర్కొంది. 

ఈ తరం ఆటగాళ్లలో ఎం ఎస్ ధోని, కేఎల్ రాహుల్ అంటే ఇష్టం అని పూజా పేర్కొంది. ఈ తరంలో ఎంత గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ రాహుల్ ద్రవిడ్ కు ఎవరూ సాటిరారు అని పూజా హెగ్డే పేర్కొంది. ద్రవిడ్ అట క్లాస్ గా ఉంటుందని పూజా చెప్పుకొచ్చింది.