తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది పూజ హెడ్గే. వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజైన అల వైకుంఠపురములో చిత్రం హిట్ అవటం ఆమెకు బాగా కలిసొచ్చింది. వరస పెట్టి పెద్ద హీరోలంతా ఆమెను అడుగుతున్నారు. అయితే ఆమె ఇప్పటికే ప్రభాస్ సినిమా కమిటై ఉంది. దాన్ని ఫినిష్ చేయాల్సి ఉంది. వాస్తవానికి ఆ మధ్యన ఆమెతో ఫారిన్ షెడ్యుల్ ప్లాన్ చేసారు ప్రభాస్ 20 టీమ్. అయితే ఆమె సిక్ అవటంతో ఆ షెడ్యూల్ మొత్తం కొలాప్స్ అయ్యింది. ప్రభాస్, పూజ హెడ్గే మధ్య తియాల్సిన సీన్స్ కాన్సిల్ చేసుకుని ఇండియాకు వచ్చేసారు.

గత కొద్ది రోజులుగా అల వైకుంఠపురములో చిత్రం ప్రమోషన్ యాక్టవిటిస్ లో  పాల్గొంది. ఈ రోజు నుంచి మళ్లీ ప్రభాస్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్నారు. వరస పెట్టి డేట్స్ ని ప్రభాస్ సినిమా కోసం ఆమె కేటాయించింది.

ఇదిలా ఉంటే..పవన్ సినిమా కోసం పూజ హెడ్గేని అడిగారు. పూజా కూడా ఈ మధ్యన తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. దాంతో  ఆమె దాదాపుగా ఆ సినిమాకి ఓకే చెప్పిన‌ట్టే. కానీ డేట్ల విష‌యంలోనే త‌న‌కి క్లారిటీ కావాల‌ని, దాన్నిబ‌ట్టి ప్లాన్ చేస్తాన‌ని ఆమె చెప్పిందని వినిపిస్తోంది. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న ప‌వ‌న్ `పింక్‌` ఎప్పుడు ప్రారంబిస్తాడో, కొత్త సినిమాకోసం ఎప్పుడు డేట్లు స‌ర్దుబాటు చేస్తాడో, అప్పుడు పూజాకి ఖాళీ ఉంటుందో అనే డౌటే టీమ్ కు నిద్రపట్టనివ్వటంలేదట. అన్నీ కుదిరితే మాత్రం ప‌వ‌న్ ప‌క్క‌న పూజ క‌నిపించ‌డం ఖాయ‌మైన‌ట్టే అంటున్నారు.