సెల్రబిటీల విషయంలో చిన్న చిన్న పొరపాట్లు కూడా ఒక్కొసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పరిస్థితి అలాగే ఉంది. తన చెల్లెలు ఆవేశంతో చేసిన ఓ పని కారణంగా ఈ భామ చిక్కుల్లో పడింది. ఇటీవల కంగనా రనౌత్‌ చెల్లెలు ఓ తన ట్విటర్‌ పేజ్‌లో ఓ వివాదాస్పద పోస్ట్ చేసింది. ఓ వర్గాన్ని కార్నర్ చేస్తూ చేసిన ఈ పోస్ట్ సరైంది కాదని ట్విటర్ సంస్థ ఆమె ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఆమె వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ ఆమె మీద కేసు కూడా నమోదైంది.

ఈ విషయంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు. అయితే తరువాత తన చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదని, ఏ వర్గాన్ని తప్పుగా చూపించటం ఆమె ఉద్దేశం కాదని కంగనా సర్థి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ప్రయత్నమే ఇప్పుడు కంగనాను చిక్కుల్లో పడేసింది. రంగోలి వ్యాఖ్యలను సమర్థించటం అంటే విద్వేషపూరిత వ్యాఖ్యలను సమర్థించటమే అంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ కారణంతోనే కంగనా మీద కూడా కేసు నమోదైంది.

బాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్ కంగనా రనౌత్ తన సినిమాలతో ఏ స్థాయిలో పేరుతెచ్చుకుందో.. వివాదాలతోనూ అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కంగనా లాగే ఆమె చెల్లెలు రంగోలి చండల్‌ కూడా ఎన్నో వివాదాల్లో తల దూర్చింది. ముఖ్యంగా కంగనాను విమర్శించే వారి విషయంలొ కాస్త ఘాటుగానే స్పందిస్తుంది రంగోలి. కంగానాను డిఫెండ్‌ చేసేందుకు చాలా మంది ప్రముఖుల మీద దారుణమైన కామెంట్స్ చేసింది ఈ భామ. కొన్ని సందర్భాల్లో హద్దులు మీరి కామెంట్స్ చేయటంతో అవి కేసుల వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.