సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను మనం ఇంకా మరవకముందే... టాలీవుడ్ లో కూడా అటువంటిదే ఒక సంఘటన చోటుచేసుకోబుతుండగా పోలీసులు, అతని మిత్రులు అతన్ని చివరి నిమిషంలో రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. 

వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ కి చెందిన ఒక స్క్రిప్ట్ రైటర్(బెంగాలీ సినిమా ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అనే అంటారు) ఒక నిర్జన ఫ్లాట్ లో లోపల తలుపు వేసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. 

ఇంట్లో కొత్త స్క్రిప్ట్ రాసుకోవడానికి పేపర్లు తెచ్చుకుంటానని చెప్పి బయటకు వెళ్ళాడు. పేస్ బుక్ లో "వెన్ ఐ క్విట్" అని పోస్ట్ పెట్టాడు. ఈ మెసేజ్ చూడగానే టాలీవుడ్ అంతా అప్రమత్తమైంది.

సుశాంత్ ఉదంతం నేపథ్యంలో వెంటనే శ్రీజన్ రాయ్ అనే ఒక డైరెక్టర్ సదరు స్క్రిప్ట్ రైటర్ ఇంటికి ఇంకో ఇద్దరు మిత్రులను తీసుకొని వెళ్ళాడు. మరికొందరు మిత్రుల సహాయంతో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి వెదకడం ప్రారంభించారు. 

ఫోన్ లో మాట్లాడుతూ అతడు బిగ్గరగా ఏడుస్తూ కాల్ కట్ చేసాడు. లొకేషన్ ఆధారంగా అతడి ఫ్లాట్ కి వెళ్లి తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లి చూడగా... అపస్మారక స్థితిలో పది ఉన్నాడు. అతడిని తీసుకొని అక్కడినుండి ఆసుపత్రిలో చేర్పించారు. 

సోషల్ మీడియాలో అతడి పోస్ట్ ను గనుక సీరియస్ గా తీసుకోకపోయి ఉంటె... ఒక నిండు ప్రాణం బాలయ్యేదని ఇండస్ట్రీ వర్గాలు అన్నారు. అతడు ప్రాణాలతో బయటపడ్డందుకు ఆనదంగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వెళ్లి కలుస్తామని అన్నారు. 

గర్ల్ ఫ్రెండ్ తో వివాదం కారణంగానే సదరు స్క్రిప్ట్ రైటర్ తన ప్రాణాన్ని బలితీసుకోవాలని అనుకున్నట్టుగా ప్రాథమికంగా తెలియవచ్చింది.