డబ్ స్మాష్ స్టార్ గా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి.. 'ఛల్ మోహన రంగ' అనే సినిమాలో నటించింది. కానీ అమ్మడుకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. గతేడాది బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.

సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత అంటూ గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి.. బొద్దుగుమ్మగా మారి బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఆ సమయంలో ఆమెని బాగా ట్రోల్ చేశారు.

బిగ్ బాస్ బొద్దుగుమ్మ.. సెక్సీగా మారిందే.. వైరలౌతున్న అష్షురెడ్డి హాట్ ఫోటోలు!

దీంతో తన బరువు బాగా తగ్గి మళ్లీ నాజుకూగా మారింది. ఇది ఇలా ఉండగా.. అషురెడ్డి.. పవన్ కి వీరాభిమాని. ఎంతలా అంటే పవన్ పేరుని ఆమె ప్రైవేట్ పార్ట్ పై పచ్చబొట్టు వేసుకుంది. 2018లో పవన్ ఫ్యాన్స్ కి క్రిటిక్ కత్తి మహేష్ కి సోషల్ మీడియా వార్ జరుగుతున్న సమయంలో.. అషురెడ్డి తన టాటూని బయటపెట్టింది.

'నేను పవన్ టాటూ వేయించుకున్నా.. అంటే దానర్థం నాకు ఆయనకు ఎఫైర్ ఉన్నట్లా..? జవాబు చెప్పండి' అంటూ కత్తి మహేష్ పై విరుచుకుపడింది. అప్పట్లో అషురెడ్డి టాటూ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తాజాగా మరోసారి ఈ బ్యూటీ టాటూ కనిపించేలా ఫోటోలకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.