తమిళ హీరో విజయ్‌, దర్శకుడు అట్లీది హిట్‌ కాంబినేషన్‌. ‘తెరి’, ‘మెర్సల్‌’ తర్వాత వీరిద్దరి కలయిలో వస్తున్న మూడో సినిమా ‘బిగిల్‌’. బిగిల్ అంటే తెలుగులో ఈల అని అర్ధం... అందుకే ఈ సినిమా తెలుగు టైటిల్ 'విజిల్' అనే ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. ట్రైలర్ యూట్యూబ్ లో 
సంచలనాలు సృష్టించింది.

ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభియనంచేస్తున్నారు. ఇది ఇలా ఉండగా .. ఇప్పటికే ఈ సినిమా తమిళంలో వివాదాలను సృష్టిస్తోంది. ఈ సినిమా పోస్టర్ లో విజయ్ కత్తి తన కాలి దగ్గర పెట్టుకున్నాడని గొడవ చేశారు. మాంసం వ్యాపారం చేసుకునే వారు కత్తిని గౌరవంగా భావిస్తామని.. తమ మనోభావాలను విజయ్ కించపరుస్తున్నాడని గొడవ చేశారు. మరో పక్క విజయ్ యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

ఇప్పుడు సినిమాకి మరో సమస్య వచ్చి పడింది. విడుద‌ల‌కు ఓ వారం ఉంద‌న‌గా ఈ సినిమాపై ఓ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్ కంప్లైంట్ చేశాడు. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించే డైరెక్ట‌ర్ నంది చిన్ని కుమార్ త‌న సినిమా `స్ల‌మ్ సాక‌ర్‌` సినిమా మెయిన్ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని `విజిల్ చిత్రాన్ని డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించారని అంటున్నారు. `విజిల్‌` చిత్ర బృందంపై చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలంగాణ సినిమా ర‌చ‌యిత‌ల సంఘాన్ని కోరారు.

ఈ మేర‌కు పిటిష‌న్‌ను కూడా వేశారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సినీ ర‌చ‌యిత‌ల సంఘం రెండు క‌థ‌ల‌ను ప‌రిశీలించి వివాదంపై స్పందించ‌నుంది. ఈ సినిమా కోసం చిత్రబృందం రూ.180 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

విజయ్ హీరో కాబట్టి సినిమాపై ఇంత పెట్టుబడి పెట్టానని నిర్మాత అర్చన కల్పాత్తి వెల్లడించింది. దీపావళి కానుకగా విడుదల కానున్న బిగిల్ లో యాక్షన్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో నటించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు.