వెంకటేష్ - నాగ చైతన్య కలిసి నటిస్తున్న బిగ్ మల్టీస్టారర్ మూవీ వెంకిమామ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు ఖమ్మంలో గ్రాండ్ గా నిర్వహించారు. ట్రైలర్ ని కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. 

అయితే వేడుకలో ప్రతి ఒక్కరి స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ చేసిన కామెంట్స్ ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించింది. ఆమె వెంకీతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని వెంకటేష్ కి స్పెషల్ గా [ప్రపోజ్ చేశారు. ఐ లవ్యూ వెంకటేష్ గారు అనగానే అభిమానులు ఒక్కసారిగా విజిల్స్ వేయించారు. అనంతరం కామెంట్ ని సవరించిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ ఆయన మీద అభిమానంతో ఐ లవ్యూ చెప్పినట్లు తెలిపింది. 

అలాగే వెంకీ మామ, అల్లుడు ఇద్దరికి కూడా ఐ లవ్యూ చెప్పిన పాయల్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని తాను ఒక హిందీ టీచర్ పాత్రలో నటించినట్లు క్లారిటీ ఇచ్చింది. మొదటి రోజు సినిమా షూటింగ్ లో నెర్వస్ గా అనిపించినప్పుడు వెంకటేష్ గారు చాలా హెల్ప్ చేసినట్లు వివరించారు. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెబుతూ డిసెంబర్ 13న సినిమా రిలీజ్ కాబోతున్నట్లు పాయల్ వివరణ ఇచ్చారు.