దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇండియన్ 2. దాదాపు పాతికేళ్ల క్రితం విడుదలైన కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియన్ 2 సెట్స్ లో క్రేన్ విరిగిపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మృతిచెందారు. 

శంకర్ కూడా గాయాలకు గురయ్యారు. ఆ చేదు అనుభవాలనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర యూనిట్ త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. లాక్ డౌన్ తర్వాత షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఇండియన్ 2 గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది. 

శంకర్ ఈ చిత్రంలో భారీ ఖర్చుతో స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించబోతున్నారట. నెవర్ బిఫోర్ అనే విధంగా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం దర్శకుడు శంకర్ ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ని ఎంపిక చేసుకున్నట్లు టాక్. తొలి చిత్రం నుంచే అందాలతో హీటెక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్ శంకర్ కంట్లో పండింది. 

స్పెషల్ సాంగ్ అయినప్పటికీ శంకర్ సినిమా కావడంతో ఈ చిత్రం ద్వారా పాయల్ రాజ్ పుత్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే పాయల్ రాజ్ పుత్ కి ఇది బంపర్ ఆఫరే.