పరిచయం అయిన మొదటి చిత్రంతోనే హాట్ గా అందాలు ఆరబోసి, ముద్దులు మీద ముద్దులు తో కుర్రకారుకు విందు భోజనం పెట్టేసింది పాయల్ రాజ్ పుట్.   'ఆర్.ఎక్స్ -100' చిత్రంలో అందాలన్నీ ఆరబోసి  ఓవర్ నైట్ లో  స్టార్ గా మారింది. దాంతో పాయల్‌కు ఆఫర్స్ వరస కట్టేసాయి. అయితే వాటిని ప్రక్కన పెట్టేసి హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమా అయిన.. ఆర్ డి ఎక్స్ లవ్  చేసింది.

ఈ సినిమా టైటిల్, ట్రైలర్ చూసినప్పుడే ఆర్ ఎక్స్ 100 తో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు సిద్దమయ్యిపోయారని జనం అనుకున్నారు. ఈ లోగా సినిమా రిలీజ్ అయ్యింది. అయితే అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. సినిమాలో అందాల ప్రదర్శన, వల్గర్
టాక్ తప్ప మరేమి లేదని తేల్చేసారు ఆడియన్స్. ఈ నేపధ్యంలో పాయిల్ ఓ ట్వీట్ చేసి, ఆడియన్స్ కు థాంక్స్ చెప్పుకుంది.

“ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో నా ఫెరఫార్మెన్స్ ని చూసి మెచ్చుకుంటున్నందుకు కృతజ్ఞతలు. నేను ఒకటి చెప్తాను, ఆర్ ఎక్స్ 100 తర్వాత వెంటనే ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేసి మొత్తం బరువు నా భుజాల పై మోయాలనుకోవటం అనేది అంత ఈజీగా తీసుకున్న నిర్ణయం కాదు.! నా పేరు చెప్పి జనాలని థియోటర్స్ కు రప్పించటం అంటే భయపడ్డాను. అయినా చేసాను.మీరంతా నా పక్షాన ఉన్నారు కాబట్టి ధైర్యం చేసాను. చాలా చాలా ధాంక్స్ ,” అన్నారామె.

అయితే ఈ సినిమా రిజల్ట్ ఆమెకు అర్దమైందా...అది చూసే ఈ ట్వీట్ చేసిందా అనేది ఇప్పుడు ఆమె అభిమానుల్లో జరుగుతున్న చర్చ.  బీ గ్రేడ్ మూవీ కంటెంట్ తో మరీ పాత కాలం కథ,కథనంలో వచ్చిన ఇలాంటి సినిమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆమెకు అభిమానులు సలహా ఇస్తున్నారు. ఓపెనింగ్స్ ఓకే అనిపించుకున్నా కలెక్షన్స్  లేకపోవటం డిస్ట్రిబ్యూటర్స్ ని కలవరపరిచే అంశం.