పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అజ్ఞాతవాసి అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ నెక్స్ట్ ఎలాగైనా మంచి సినిమాతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయాలనీ కష్టపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ ఒక సరికొత్త తరహాలో ఆకట్టుకునేందుకు పింక్ రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు.

ఇకపోతే చాలా వరకు మెగా అభిమానులు పవన్ ఆ కథ చేయడం నచ్చడం లేదనే కామెంట్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం అదే కథతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. పాలిటిక్స్ అనంతరం జనాలందరినీ ఆకట్టుకోవాలని మంచి సందేశం ఉండాలని అందుకే ఈ కథపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కథలో కొన్ని మార్పులు చేయలని ఇటీవల దర్శక నిర్మాతలతో చర్చించినట్లు టాక్.  బోణి కపూర్ తో కలిసి దిల్ రాజు పింక్ రీమేక్ ని నిర్మించనున్నారు.

ఓ మై ఫ్రెండ్ - MCA చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకుడిగా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక స్క్రిప్ట్ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన పవన్ తప్పనిసరిగా మార్పులు చేయాలనీ దర్శకుడికి సూచించినట్లు సమాచారం. మరోసారి స్టోరీ డిస్కర్షన్స్ లో పాల్గొని సినిమాని సెట్స్ పైకి తేవాలని దిల్ రాజు పవన్ ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.