పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కేవలం ఒక నెల గ్యాప్ లోనే వరుసగా మూడు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో పింక్  రీమేక్ కి మొదలెట్టిన పవన్ క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కేవలం ఒక నెల గ్యాప్ లోనే వరుసగా మూడు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో పింక్ రీమేక్ కి మొదలెట్టిన పవన్ క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక రీసెంట్ గా తనకు గబ్బర్ సింగ్ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమాను ఒకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇక సీక్రెట్ గా అందిన సమాచారం ప్రకారం మరొక కథకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా పవన్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ ప్రాజెక్ట్ కి చాలా సమయం పట్టేలా ఉంది. గౌతమ్ ప్రస్తుతం జెర్సీ కథను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఇక పవన్ తో వచ్చే ఏడాది కొత్త సినిమాని స్టార్ట్ చేసి 2021 ఎండింగ్ లోనే సినిమాని విడుదల చేయవచ్చని టాక్. పింక్ రీమేక్ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇదే ఏడాది మే నెలలో రానుంది. ఇక క్రిష్ సినిమాను కూడా త్వరలోనే మొదలుపెట్టి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఇక హరీష్ శంకర్ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ (మే) లో వచ్చే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరీ పవన్ ప్రణాళికలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.