పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తారు? అనే సందేహాలకు దాదాపు తెరపడింది. గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ 26 ప్రాజెక్ట్ గురించి అనేక రకాల రూమర్స్ ఆడియెన్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేస్తూనే ఉన్నాయి. ఇక ఎట్టకేలకు వాటిపై క్లారిటీ వచ్చేసింది.

అయితే ఆ వార్త పవన్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ ని బయపెడుతున్నాయనే చెప్పాలి. అందులోను సక్సెస్ లేని ఒక డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం చూస్తుంటే పవన్ ఆలోచన విధానం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా ఉంటుందని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి.

ఇక దర్శకుడు అనే విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఓ మై ఫ్రెండ్ - MCA చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నెక్స్ట్ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇక ముందుగా ఉహించినట్టుగా అమితాబ్ పింక్ రీమేక్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ వేణు శ్రీరామ్ గత రెండు సినిమాలు ఆడియెన్స్ ని పెద్దగా మెప్పించింది లేదు. ఓ మై ఫ్రెండ్ డిజాస్టర్ కాగా నానితో చేసిన MCA పెట్టిన బడ్జెట్ ని వెనక్కి తెచ్చింది అంతే. ఈ దర్శకుడు పవన్ లాంటి స్టార్ హీరో కమ్ బ్యాక్ ఫిల్మ్ ని డైరక్ట్ చేయడం ఆడియెన్స్ కి అయితే నచ్చడం లేదు.

పైగా పింక్ రీమేక్ ని పవన్ క్రేజ్ కి తగ్గట్టు హ్యాండిల్ చేయగలడా అనేది పెద్ద మిస్టరీగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా అయితే ఇలాంటి సినిమా చేయడం కన్నా చేయకుండా ఉండటమే బేటర్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.