కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఒక్కసారిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ కష్టకాలంలో ఎవరు ఊహించని పరిణామాలు మానవాళిని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయం కూడా తగ్గిపోయింది. ఈ తరుణంలో సెలబ్రెటీలు తోచినంత సాయం అందిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలకు విరాలన్ని ప్రకటించారు.

ఆంద్రప్రదేశ్ - తెలంగాణ రెండు ప్రభుత్వాలకు 10లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో నలబైకి పైగా కరోనా కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. మొత్తం రాష్ట్రమంతా లాక్ డౌన్ ప్రకటించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక నితిన్ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు 10లక్షలు విరాలన్ని అందించిన విషయం తెలిసిందే.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కోటిరుపాయలు సాయం అందించడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు 50లక్షలు చొప్పున విరాళాన్ని ప్రకటించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయల సాయం అందించారు. ప్రస్తుతం దేశమంతా 600కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ ని ప్రకటించిన కేంద్రం వీలైనంత త్వరగా వైరస్ ని అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది.