Chandra Mohan: పవన్ , త్రివిక్రమ్, బ్రహ్మానందం సహా చంద్రమోహన్ కు పలువురు ప్రముఖుల నివాళి

చంద్రమోహన్ మరణంతో .. ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు.. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పించగా.. కొంత మంది తారలు మాత్రం చంద్రమోహన్ నివాసానికి వెళ్లి.. నివాళి అర్పిస్తున్నారు. 
 

Pawan Kalyan Trivikram and Brahmanandam Visit Chandra Mohan House JMS


ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ఈరెండు మూడేళ్లలోనే దిగ్గజ నటులను కోల్పోయింది చిత్ర పరిశ్రమ. టాలీవుడ్ కు మూలస్థాంభాల మాదిరి ఉన్న కృష్ణ, కృష్ణం రాజు, శరత్ బాబు, కె విశ్వనాథ్ లాంటి దృవతారలను కోప్లోయింది పరిశ్రమ. ఇక తాజాగా చంద్రమోహన్ మరణంతో పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్ స్టార్స్ తమ సంతాపాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరికొంత మంది చంద్రమోహన్ ఇంటికి వెళ్ళి నివాళి అర్పిస్తున్నారు. 

చంద్రమోహన్ పార్దీవ దేహానికి నివాళి అర్పించారు.. టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్. అంతకు ముందు ఆయన మరణానికి సంతాపం ప్రకటిస్తూ..నోట్ ను రిలీజ్ చేసిన పవర్ స్థార్.. డైరెక్ట్ గా చంద్రమోహన్ ఇంటికి వెళ్లి.. ఆయనకునివాళి అర్పించారు. అటు పవర్ స్టార్ తో కలిసి త్రివిక్రమ శ్రీనివాస్ కూడా పవర్ స్టార్ వెంట ఉన్నారు. చంద్రమోహన్ కునివాళి అర్పించారు. 

Pawan Kalyan Trivikram and Brahmanandam Visit Chandra Mohan House JMS

ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా చంద్రమోహన్ నివాసానికి వెళ్లారు. ఆయన పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. వీరితో పాటు ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు చంద్రమోహన్ ను చివరి సారి చూడటానికి క్యూ కడుతున్నారు. చంద్రమోహన్ తో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అలనాటి నటిప్రభ కూడా ఆయనకు నివాళి అర్పించారు. వారితో పాటు టాలీవుడ్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లు ఎందరో చంద్రమోహన్ కు నివాళి అర్పించారు.

Pawan Kalyan Trivikram and Brahmanandam Visit Chandra Mohan House JMS

ఇక సోషల్ మీడియా వేదిక గా చాలా మంది స్టార్లు నివాళి అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, బాలయ్య, నాని, పవర్ స్టార్, మహేష్ బాబు, వెంకటేష్  తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులెందురో చంద్రమోహన్ కు నివాళి అర్పించారు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన పేజ్ ను క్రియేట్ చేసుకున్నారు చంద్రమోహాన్. 82 ఏళ్ల వయస్సులో గుండె సంబంధిత సమస్యలతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

Pawan Kalyan Trivikram and Brahmanandam Visit Chandra Mohan House JMS

అన్ని భాషలు కలుపుకుని దాదాపు 950 కి పైగా సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. హీరోగా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, తండ్రిగా, అన్నగా, తాతగా..ఇలా ఆయన చేయని పాత్రంటూ లేదు.  ఎంతో మంది నటీనటులకు ఆదర్శంగా నిలిచిన చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios