రాజకీయాలతో బిజీ గా ఉండి సినిమాలను ప్రక్కన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మళ్లీ వెండితెరపై కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  హిందీలో విజయవంతమైన పింక్ రీమేక్ తో పవర్ స్టార్ మనసు మార్చుకుని రీఎంట్రీ ఇస్తున్నారు. ఇదే ఊపులో ఆయన మరో సినిమా కూడా ఓకే చేసినట్లు సమాచారం. రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) దర్శకత్వంలో చేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిమిత్తం గత కొంత రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లు చెప్తన్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తారు. ఆయన గతంలో ఎప్పుడో పవన్ కు అడ్వాన్స్ ఇఛ్చి ఉన్నారు. దాంతో పవన్ ఈ ప్రాజెక్టుకు సై అన్నట్లు సమాచారం. దాదాపు జానపదం లాంటి కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ దొంగగా కనిపిస్తారని అంటున్నారు. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ ఇదని చెప్తున్నారు.  

ఆంద్రప్రదేశ్ రాజధాని వివాదం.. సినీ రచయిత షాకింగ్ కామెంట్స్

మ‌హ‌మ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం, అప్ప‌టి ప‌రిస్థితులను ఇప్పుడు కూడా అలాంటి పరిస్దితులే రన్ అవుతున్నాయని వ్యంగ్యంగా చెప్తూ, ఓ కొత్త తరహా పీరియడ్ డ్రామా ని  క్రిష్ తెర‌పై చూపించ‌బోతున్నారు.ఇందు కోసం భారీ సెట్లు వేయ‌బోతున్నారని చెప్తన్నారు.  ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందటున్నారు.

ఇండస్ట్రీ నుంచి వినపడుతున్న దాని ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు వందకోట్లు ఉంటుందని సమాచారం. కథ ప్రకారం.. సినిమాకి చాలా గ్రాఫిక్ వర్క్ అవసరం. అలాగే బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యంలా ఓ రాజ్యం సెట్  నిర్మిస్తారని అంటున్నారు. పెద్దపెద్ద రాజదర్బార్లు, కోటలు.. గుర్రపు స్వారీ లు, కత్తి యుద్దాలు ఇందులో కనిపిస్తాయట. ఇధి పవన్ కు ప్యాన్ ఇండియా మూవీ అని.... ఈ సినిమాని క్రిష్.. మణికర్ణిక, గౌతమీ పుత్ర శాతకర్ణి రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడట క్రిష్.