"జార్జ్ రెడ్డి"... దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జి రెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు..  

నేటి తరంలో చాలా మందికి తెలియని వ్యక్తి జార్జ్. ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి,  అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైందో.. అందరూ షాక్ అయ్యారు.

Also Read..

'జార్జ్‌రెడ్డి' ట్రైలర్.. చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి కథ!

ఎంతో ఇంటెన్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు దర్శకుడు జీవన్ రెడ్డిని అభినందించారు. సోషల్ మీడియాలో ట్రైలర్  ట్రెండింగ్ గా నిలిచింది. ఇప్పుడు మరో విషయం ఏంటంటే.. ఈ డైరెక్టర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూసిన పవన్ ప్రత్యేకంగా జీవన్ రెడ్డికి ఫోన్ చేయించారట.

తనను వచ్చి కలవమని చెప్పారట. దీంతో దర్శకుడు బాగా ఎగ్జైట్ అవుతున్నట్లు సమాచారం. పవన్ ఆలోచనలకు, అతడి భావాలకు దగ్గరగా సినిమా ఉండడంతో జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవడానికి సిద్ధమవుతున్నారు. అతడు గనుక పవన్ ని ఇంప్రెస్ చేయగలిగితే పవన్ తన రాజకీయ భవిష్యత్తుకి  సరిపడా కథను సిద్ధం చేయమని జీవన్ రెడ్డికి చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

 

1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం  గురించి తెలుసు. కానీ ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.