ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జార్జ్ రెడ్డి. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జ్ రెడ్డి’’.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ..విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’  బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది..ఇప్పటికే బిజినెస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ముందు నుంచి పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ తో టచ్ లో ఉంటున్నారు. ట్రైలర్ చూసి దర్శకుడితో ప్రత్యేకంగా మాట్లాడారు.  ఇక మొత్తానికి ఈ నెల 17న జరగబోయే జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఆ డేట్ కి ఫ్రీ అవుతున్నారని తెలిసి చిత్ర యూనిట్ ఈవెంట్ ని జరపడానికి ఫిక్స్ అయ్యారు.

పవన్ వేడుకకు వస్తే సినిమాపై మరింత క్రేజ్ పెరగడం కాయం. మరి సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి..సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.