Asianet News TeluguAsianet News Telugu

పవన్ సినిమాకి రేటు పలకడం లేదా..?

ఈ సినిమాకి హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అంటే మాత్రం బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం పవన్ చేస్తున్న సినిమా బాలీవుడ్ సినిమా 'పింక్'కి రీమేక్ కావడం, అలాగే తమిళంలో కూడా ఇప్పటికే సినిమా రిలీజ్ అవ్వడం. 

Pawan kalyan's Pink Remake movie Business
Author
Hyderabad, First Published Feb 18, 2020, 3:39 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి హీరో కమ్ బ్యాక్ సినిమా అంటే ఆ లెక్కలు ఎలా ఉంటాయో ఊహించలేం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని సమాచారం. ఈ సినిమాకి హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అంటే మాత్రం బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

దీనికి కారణం పవన్ చేస్తున్న సినిమా బాలీవుడ్ సినిమా 'పింక్'కి రీమేక్ కావడం, అలాగే తమిళంలో కూడా ఇప్పటికే సినిమా రిలీజ్ అవ్వడం. ఈ రెండు సినిమాల వెర్షన్లు ఇప్పటికే చాలా మంది చూశారు. రెండు పాపులర్ సినిమాలే. అందువల్ల ఎంత మార్పులు చేసినా, రేటు ఇవ్వడం కష్టమన్నది బయ్యర్ల అభిప్రాయంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మహానటి డైరెక్టర్ తో ప్రభాస్.. నిజమేనా?

శాటిలైట్ సంగతి పక్కన పెడితే, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మంచి అమౌంట్ వస్తుందనుకున్నారని.. కానీ ఆ మేరకు ఎంక్వైరీలు రావడం లేదని తెలుస్తోంది. ఓ మీడియం సినిమాకి పలికిన రేటు మాదిరిగా రూ.5 కోట్లు పలుకుతోందని తెలుస్తోంది.

మరి ఇలా ఐదు కోట్ల దగ్గర ప్రారంభమైన బేరం ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. నిర్మాత దిల్ రాజు తన పలుకుబడి ఎంతగా వాడుతున్నా.. బయ్యర్ల సైడ్ మాత్రం రేటు పెద్దగా పలకడం లేదని ముంబై వర్గాల సమాచారం. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios