సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కుమార్తె.. ఫ్యాన్స్ కే షాక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, విరూపాక్ష లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, విరూపాక్ష లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే తన గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ దర్శత్వంలోనూ పవన్ మరో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. అకిరా నందన్, ఆద్యల విశేషాలు అభిమానులకు రేణు దేశాయ్ వల్లే తెలుస్తున్నాయి. తరచుగా ఆమె అకిరా, ఆద్య ఫోటోలు, వీడియోల్ని షేర్ చేస్తున్నారు.
తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఆద్య వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆధ్య ఈ వీడియోలో తన యాక్టింగ్ స్కిల్స్ ని బయట పెట్టింది. అద్భుతమైన హావ భావాలతో ఆకట్టుకుంది. డాక్టర్ లాగా, ఓ పేషంట్ లాగా ఆద్య చెప్పిన ఫన్నీ డైలాగులు అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి.
పవన్ అభిమానులంతా అకిరా సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆద్య నటనతో ఆకట్టుకోవడం ఫ్యాన్స్ కు సైతం షాకింగ్ గా ఉంది. ప్రస్తుతం ఆద్య వీడియోను నెటిజన్లంతా ఎంజాయ్ చేస్తున్నారు.