పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా ప్రభావం లేకుంటే ఈ పాటికి వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ సన్నాహకాల్లో ఉండేది. ఇంకా ఈ చిత్ర చిత్రీకరణ కొంతభాగం మిగిలే ఉంది. 

అలాగే పవన్ క్రిష్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నారు. ఆ తదుపరి హరీష్ శంకర్ దర్శత్వంలో పవన్ నటించాల్సి ఉంది. ఇక పవన్ 29వ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 29వ చిత్రాన్ని కాటమరాయుడు ఫేమ్ కిషోర్ కుమార్ పార్దసాని(డాలీ) తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రియాంక జవాల్కర్ నడుము అందాలు.. స్టన్నింగ్ హాట్

ఇప్పటికే కిషోర్ కుమార్ కథ కూడా సిద్ధం చేసినట్లు టాక్. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని పవన్ తన స్నేహితుడు రామ్ తాళ్లూరికి ఇచ్చారట. ఎన్నారై బిజినెస్ మ్యాన్ గా రామ్ తాళ్లూరి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆర్థికంగా సాయం చేశారు. నిర్మాతగా మారిన రామ్.. నేలటికెట్టు, డిస్కోరాజా లాంటి చిత్రాలని రామ్ నిర్మించారు. 

ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. దీనితో రామ్ తాళ్లూరి నష్టపోయారు. దీనితో ఇబ్బందుల్లో ఉన్న రామ్ ని ఆదుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారట. లాక్ డౌన్ తర్వాత పవన్, డాలీ, రామ్ తాళ్లూరి కాంబోలో చిత్రానికి ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.