పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత సినిమా ఇండస్ట్రీలో స్పీడ్ పెంచాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు చకచకా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో సిద్దమవుతున్న పవర్ స్టార్ వీలైనంత త్వరగా మరొక రెండు సినిమాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

అలాగే మరొక సినిమాకు కూడా ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగానే పూరి జగన్నాథ్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పవర్ స్టార్ సిద్ధంగా ఉన్నారట. గత కొన్నేళ్లుగా పూరి 'జనగణమన' అనే స్క్రిప్ట్ ని స్టార్ హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నాడు. మహేష్ బాబు ఆ మధ్య చేస్తానని చెప్పి డ్రాప్ అయ్యాడు. ఇక అదే కథను పవన్ కళ్యాణ్ తో చేయాలనీ పూరి డిసైడ్ అయ్యాడట.

ఆ కథలో పవన్ ని సీఎం గా కనిపించబోతాడట. ఎలాగైనా పవన్ తోనే ఆ సినిమా చేయాలనీ పూరి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. వకీల్ సాబ్ అనంతరం పవన్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాను పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత హరీష్ శంకర్ తో యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీ కానున్న పవర్ స్టార్ అప్పుడే పూరి 'జనగణమన' కథను కూడా సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నాడట. మరీ ఆ సినిమా ఎంతవరకు సక్సెస అవుతుందో చూడాలి.