పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ నెక్స్ట్ సినిమాపై అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నప్పటికీ పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో చిత్ర యూనిట్ ఇంకా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ ని ఫైనల్ చేసుకోలేకపోతోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. పవన్ బాలీవుడ్ పింక్ రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముందుగా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేని అనుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మరో యువ హీరోయిన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. నివేత థామస్ తాప్సి చేసిన పాత్రలో కనిపించనున్నట్లు టాక్.

 

దిల్ రాజు - బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన రాజకీయల్లో బిజీగా ఉన్నాడు. ఏ క్షణమైనా సినిమాని సెట్స్ పైకి తీసుకు రావచ్చు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ - తాప్సి నటించిన పింక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకుంది. ఇక తమిళ్ లో అజిత్ చేయగా అక్కడా కూడా ఘానా విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. ఓ మై ఫ్రెండ్ - MCA చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగు పింక్ రీమేక్ కి దర్శకత్వం వహించబోతున్నాడు.