టాలీవుడ్ మెగా అభిమానులు పవన్ నెక్స్ట్ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పింక్ రీమేక్ తో రాబోతున్నట్లు న్యూస్ వచ్చినప్పటికీ ప్రతి రోజు ఎదో ఒక టాక్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ పింక్ రీమేక్ లో నటించడం చాలా మందికి ఇష్టం లేకపోయినప్పటికీ అందరికి నచ్చేలా సినిమాను తెరకెక్కించాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఎన్నో ఏళ్ల నుంచి దిల్ రాజు, పవన్ తో సినిమా చేయాలనీ చూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి పింక్ సినిమాని రెడీ చేస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ మొదలుకాకముందే కొన్ని పోస్టర్స్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. నిజమైన పోస్టర్స్ లా ఆడియెన్స్ లో కాస్త ఆసక్తిని రేపుతున్నాయి. అభిమానులు సినిమాలు ఎనౌన్స్ చేయగానే కొన్ని పోస్టర్స్ క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఒక ఫ్యాన్ మెడ్ పోస్టర్ ఎక్కువగా వైరల్ అవుతోంది.

హీరోల కెరీర్ లో మాయని గాయాలు.. ఈ సినిమాలు

అమ్మాయిలు నో అంటే నో.. అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ముగ్గురి అమ్మాయిలు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు అనే విధంగా పోస్టర్స్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ - తాప్సి ప్రధాన పాత్రలో నటించిన పింక్ సినిమాని తమిళ్ లో అజిత్ కథానాయకుడిగా రీమేక్ చేశారు. రెండు చోట్ల సక్సెస్ కావడంతో తెలుగులో అదే తరహాలో తెరకెక్కించేందుకు దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పింక్ రీమేక్ కి థమన్ సంగీతం అందించనున్న విషయం తెలిసిందే.