పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. దీనితో పవన్ నటించే చిత్రాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దిల్ రాజు నిర్మాణంలో వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా పవన్ క్రిష్ దర్శత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత పవన్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ కథని పూర్తి చేసి కాస్టింగ్ ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం గురించి టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. గతంలో జూ.ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథకే కొన్ని మార్పులు చేసి పవన్ కోసం హరీష్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. 

ఆ కథనే పవన్ ఓకె చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ ఎన్టీఆర్ కోసం ఓ కథని వినిపించాడు. ఆ కథని ఎన్టీఆర్ రిజెక్ట్ చేయగా.. రామయ్య వస్తావయ్యా కథతో సినిమా తెరకెక్కించింది. ఆ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ అలాగే ఉండడంతో హరీష్ ఆయా కథకు కొన్ని మార్పులు జోండించి పవన్ కు వినిపించాడట. పవన్ ఎలాంటి మార్పులు లేకుండా స్టోరీని ఓకె చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలని మరో హీరోతో తెరక్కించిన సందర్భాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కరోనా కనికరిస్తే వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది.