స్క్రిప్టు పూర్తయ్యాక...దాంట్లో గబ్బర్ సింగ్ ఛాయిలు ఎక్కువ ఉన్నాయని వద్దనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయినా సుజీత్ తో సినిమా మాత్రం పవన్ వద్దనుకోలేదట. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుందని సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానయ్య, త్రివిక్రమ్ నిర్మాతలుగా సుజీత్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుందని వైరల్ అయిన వార్తల సారాంశం. అయితే స్క్రిప్టు పూర్తయ్యాక...దాంట్లో గబ్బర్ సింగ్ ఛాయిలు ఎక్కువ ఉన్నాయని వద్దనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయినా సుజీత్ తో సినిమా మాత్రం పవన్ వద్దనుకోలేదట. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ పేస్ లో జరుగుతోంది. అక్టోబర్ 5 దసరా రోజున ఈ చిత్రం లాంచ్ జరగనుందని సమాచారం.
నవంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ కు సంభందించిన పనులు ప్రారంభం అవుతాయి. ఈ చిత్రాన్ని డీవివి దానయ్య తన డీవివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ , త్రివిక్రమ్ కు చెందిన ఫార్టూన్ ఫోర్ సినిమాస్ కలిసి ప్రొడ్యూస్ చేయనున్నాయి. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి సినిమాలను తెరకెక్కించిన సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా చేయటంపై పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ సుజీత్ ‘సాహో’ తర్వాత ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించలేదు. సాహో వచ్చి ఇప్పటికి మూడేళ్ళయింది. ఈ మూడేళ్ళలో పలువురు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్ని రూమర్స్‌గానే మిగిలి పోయాయి. ఈ క్రమంలో సుజీత్, పవన్ కళ్యాణ్‌కు ఓ యాక్షన్ కథను ఫైనల్ చేసారట. పవన్‌కు కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితియార్థంలోపు విడుదలచేయాలని ప్లాన్ చేశారంటున్నారు.
మరోవైపు ఈ నెల 16వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఏకంగా 50 రోజుల డేట్లు కేటాయించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించగా వేగంగానే ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. హరిహర వీరమల్లుతో పవన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 200 కోట్ల రూపాయలకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ కు జోడీగా ఈ సినిమాలోని నిధి అగర్వాల్ నటిస్తున్నారు. పవన్ నిధి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. 2023 సంవత్సరంలో పవన్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
